కంగ్రాట్స్ టీం ఇండియా : కొలుసు పార్థ‌సార‌థి

సంజూ శాంస‌న్ ఆడిన తీరు అద్బుతం

అమ‌రావతి : ఏపీ స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. టీ-20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై ఘన విజయాన్ని సాధించిన టీమ్ ఇండియాకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ చాటిన సంజు శ్యామ్సన్ కి ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు మంత్రి . శ్యామ్సన్ ఆడిన తీరు యావత్ దేశం గర్వించే విధంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. టీమ్ ఇండియా జట్టు ప్రతిభను చూసి దేశం మొత్తం మురిసి పోతోందని పేర్కొన్నారు కొలుసు పార్థ‌సార‌థి.

సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియా ఈనెల 5న ఇంగ్లండ్ మీద కూడా ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్ కి చేరాలని, ఫైనల్స్ లోనూ ఘన విజయాన్ని సాధించి మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం మురిసేలా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 195 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త్ 19.2 ఓవ‌ర్ల‌లో 198 ర‌న్స్ చేసింది. శాంస‌న్ ఒక్క‌డే 50 బంతులు ఆడి 12 ఫోర్లు 4 సిక్సులతో 97 ప‌రుగులు చేశాడు. భార‌త్ ను సెమీస్ కు చేర్చాడు.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *