సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా

హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న క‌లెక్ట‌ర్ ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డింది. ఈ మేర‌కు సీరియ‌స్ గా కామెంట్స్ చేస్తూనే వారెంట్ జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమైన భూమి నిర్వాసితుడికి పరిహారం చెల్లించాలని విచార‌ణ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ ను ఆదేశించింది హైకోర్టు. అయితే ఆ ఆదేశాల‌ను ప‌క్క‌న పెట్టారు క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా. దీంతో తన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు క‌లెక్ట‌ర్ పై హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఎందుకు ఆదేశాలు అమ‌లు చేయ‌లేద‌నే దానిపై కూడా సందీప్ కుమార్ ఝా వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించింది కోర్టు. ఇది అత్యంత బాధ్య‌తా రాహిత్యం అంటూ ఫైర్ అయ్యింది. విచార‌ణ‌కు హాజ‌రు కాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలకు ఆదేశించింది.

ఈ కేసు చీర్లవంచకు చెందిన భూమి నిర్వాసితుడైన వేల్పుల యెల్లయ్యకు సంబంధించింది. అతను మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో తన ఇంటిని కోల్పోయాడు. జిల్లా యంత్రాంగం తనకు తగిన పరిహారం అందించడంలో విఫలమైనందున కోర్టును ఆశ్రయించాడు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *