జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి : కేటీఆర్

Spread the love

సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని నిరూపించాలి

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించారు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ని ఖతం చేస్తే కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోంద‌న్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదన్నారు కేటీఆర్.. గీతక్క, సీతక్క, సురేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ ప్రభుత్వం అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటున్న న‌రేంద్ర మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడ‌ని దీని వెనుక క‌థ ఏమిటో ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు. మీ విలువైన ఓటును మోసానికి వేస్తారా లేక ఆదుకునే వాళ్ల వైపు ఉంటారా తేల్చుకోవాల‌ని అన్నారు. రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్‌ను ప్రశంసించిన రేవంత్, వేటకుక్క అన్న సీబీఐని కేసీఆర్ మీదకే ప్రయోగించాడని ఆరోపించారు. దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసింద‌ని చెప్పారు కేటీఆర్. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు..

  • Related Posts

    ఎర్ర బుక్కులో జ‌గ‌న్ పేరు రాస్తే నీకే ప్ర‌మాదం

    Spread the love

    Spread the loveమంత్రి నారా లోకేష్ ను హెచ్చ‌రించిన కొడాలి నాని బెజ‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. గ‌త కొంత కాలంగా మౌనంగా ఉంటూ వ‌చ్చిన త‌ను ఉన్న‌ట్టుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం…

    కేసీఆర్ ను విమ‌ర్శించే అర్హ‌త ఆకునూరికి లేదు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : ఏం అర్హ‌త ఉంద‌ని మాజీ సీఎం కేసీఆర్ ను విమ‌ర్శిస్తారంటూ తెలంగాణ విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళిని ఉద్దేశించి ప్ర‌శ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *