జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని నిరూపించాలి

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించారు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ని ఖతం చేస్తే కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోంద‌న్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదన్నారు కేటీఆర్.. గీతక్క, సీతక్క, సురేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ ప్రభుత్వం అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటున్న న‌రేంద్ర మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడ‌ని దీని వెనుక క‌థ ఏమిటో ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు. మీ విలువైన ఓటును మోసానికి వేస్తారా లేక ఆదుకునే వాళ్ల వైపు ఉంటారా తేల్చుకోవాల‌ని అన్నారు. రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్‌ను ప్రశంసించిన రేవంత్, వేటకుక్క అన్న సీబీఐని కేసీఆర్ మీదకే ప్రయోగించాడని ఆరోపించారు. దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసింద‌ని చెప్పారు కేటీఆర్. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు..

  • Related Posts

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *