2 రోజుల క‌స్ట‌డీకి వ్యాపార‌వేత్త స‌మీర్ మోడీ

ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు

న్యూఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త స‌మీర్ కె మోడీకి బిగ్ షాక్ త‌గిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో పోలీసులు. అనంత‌రం స‌మీర్ మోడీని కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం కోర్టు వ్యాపార‌వేత్త‌కు 2 రోజుల పాటు విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి ఛాన్స్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో బాధితురాలిపై నిందితుడు దాఖలు చేసిన దోపిడీకి సంబంధించిన ఫిర్యాదును కూడా పోలీసులు విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఈ వ్యాపార‌వేత్త స‌మీర్ కె మోడీ ఎవ‌రో కాదు స్వ‌యాన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) మాజీ చీఫ్ ల‌లిత్ మోడీకి సోద‌రుడు.

పోలీస్ స్టేషన్ న్యూ ఫ్రెండ్స్ కాలనీ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) ప్రకారం సమీర్ మోడీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత ఒక మహిళ ఐదు రోజుల క్రితం తమను సంప్రదించి మోడీపై ఫిర్యాదు చేసిందని, దీని ఫలితంగా అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేయబడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటన ముందే జరిగిందని ఆ మహిళ ఆరోపించింది. 2019 నుండి మోడీతో సంబంధం ఉందని చెప్పుకునే మహిళ ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 10 ఎఫ్ఐఆర్ నమోదు చేశామ‌న్నారు. మోడీ గ్రూప్ కింద అనేక కార్యక్రమాలను ప్రారంభించడంలో మోడీ కీలక పాత్ర పోషించారు, వాటిలో 2004లో మోడీకేర్, కలర్‌బార్ కాస్మెటిక్స్ , 2005లో ట్వంటీ ఫోర్ సెవెన్ కన్వీనియన్స్ స్టోర్‌లు ఉన్నాయి. మోడీ మానస పుత్రికగా పరిగణించబడే 24 సెవెన్ ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సిఆర్, చండీగఢ్‌లలో 90కి పైగా దుకాణాలను నిర్వహిస్తోంది.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *