బీఎస్ఎన్ఎల్ మ‌రింత శ‌క్తివంతం కావాలి

పిలుపునిచ్చిన నారా చంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మ‌రింత శ‌క్తివంతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ కొత్త టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. శ‌నివారం విజ‌య‌వాడ‌లో బీఎస్ఎన్ఎల్ 4జీ స‌ర్వీస్ సేవ‌ల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. త‌మ స‌ర్కార్ పెద్ద ఎత్తున సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వ‌చ్చామ‌న్నారు. ప్రజలకు 700 కి పైగా సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 1998 లో తాను కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాన‌ని చెప్పారు.

ఇది టెలికాం రంగంలో నియంత్రణ సడలింపున‌కు దారి తీసింద‌న్నారు. ఇవాళ బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన సంస్థగా మారిందని గమనించానని చెప్పారు సీఎం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో సరైన స్థానంలో సరైన వ్యక్తి అని చంద్ర‌బాబు నాయుడు పునరుద్ఘాటించారు. భారతదేశం సరైన నాయకుడు లేక పోవడం వల్లే నష్ట పోయిందని, కానీ వనరులు లేదా తెలివితేటలు లేక పోవడం వల్ల కాదని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాస‌, డిజిటల్ ఇండియా’, ఆత్మనిర్భర్ భార‌త్ వంటి వాటిని తీసుకు రావ‌డంలో మోదీ చూపిన చొర‌వ‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు నారా చంద్ర బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *