హైడ్రాను అభినందించిన హైకోర్టు

Spread the love

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణను య‌జ్ఞంలా చేస్తోంది

హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైడ్రా ప‌ని తీరును అభినందించింది హైకోర్టు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితాబిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమ‌ని పేర్కొంది. మ‌రీ ముఖ్యంగా బ‌తుక‌మ్మ‌కుంట అభివృద్ధిని చూస్తే ముచ్చ‌టేస్తోంద‌ని పేర్కొంది. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై చెత్త‌కుప్ప‌లా, పిచ్చిమొక్క‌ల‌తో అటువైపు చూడాలంటే భ‌యంగా ఉన్న ప్రాంతాన్ని చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హ‌ర్ష‌ణీయమ‌ని తెలిపింది. బ‌తుక‌మ్మ‌కుంట స‌ర్వాంగ సుంద‌రంగా మారి.. ఆ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించ‌డ‌మే కాకుండా భూగ‌ర్భ జ‌లాల‌ను కూడా పెంచింది. గ‌చ్చిబౌలిలోని మ‌ల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా క‌నిపిస్తోంది.

న‌గ‌రంలో ఇలాగే మ‌రో 5 చెరువుల అభివృద్ధి జ‌రుగుతోంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలో ఎవ‌రివైనా ఇంటి స్థ‌లాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్స‌ఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్స్‌) కింద వారికి స‌రైన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి.ప్ర‌భుత్వం ఇందుకోసం స‌రైన విధానాన్ని తీసుకు రావాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ విజ‌య్ సేన్ రెడ్డి. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువు ప‌రిధిలోని రెండు ఎక‌రాల‌కు సంబంధించిన టీడీఆర్ కేసు విచార‌ణ సంద‌ర్బంగా ఈ కీల‌క కామెంట్స్ చేశారు. టీడీఆర్ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రైన విధానాన్ని పాటిస్తే చెరువుల అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డ‌ద‌న్నారు.టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాది ఎస్ శ్రీ‌ధ‌ర్ కూడా జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించారు. కాగా త‌మ్మిడికుంట‌లో భూములు కోల్పోయిన వారికి స‌రైన టీడీఆర్ అందించాలంటూ జ‌డ్జిని కోరారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *