శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వ‌హ‌ణ

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఇక వాహ‌న సేవ‌ల‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌వంబ‌ర్ 17న సోమ‌వారం ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం, రాత్రి చిన్న శేష వాహ‌నం , 18న మంగ‌ళ‌వారం ఉద‌యం పెద్ద శేష వాహ‌నం, రాత్రి హంస వాహ‌నం, 19న బుధ‌వారం ఉద‌యం ముత్య‌పు పందిరి వాహ‌నం, రాత్రి సింహ వాహ‌నంపై అమ్మ వారు ఊరేగుతారు. 29వ తేదీ గురువారం ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి హ‌నుమంత వాహ‌నం, 21న శుక్ర‌వారం ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి గ‌జ వాహ‌నం, 22న శ‌నివారం ఉద‌యం స‌ర్వ భూపాల వాహ‌నం, సాయంత్రం స్వ‌ర్ణ ర‌థం, రాత్రి గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శ‌నం ఇస్తారు.

ఇక 23న ఆదివారం సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 24న సోమ‌వారం ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి అశ్వ వాహ‌నం, 25న మంగ‌ళ‌వారం ఉద‌యం పంచ‌మీ తీర్థం, రాత్రి ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హిస్తారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *