సుభిక్షంగా ఉండాల‌ని మ‌ల్ల‌న్న‌ను కోరుకున్నా

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

నంద్యాల జిల్లా : దేశంలోని ప్ర‌ముఖ జ్యోతిర్లింగాల‌లో ఒక‌టైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైల భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని గురువారం అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు ప్ర‌ధానికి. ఆల‌యంలోని మ‌ల్ల‌న్న స్వామికి అభిషేకం చేశారు. పూజ‌లు చేసిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రిని ఆశీర్వదించారు. తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు మ‌ల్ల‌న్న చిత్ర ప‌టాన్ని పీఎంకు ఇచ్చారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పూజ‌లు చేసిన అనంత‌రం త‌న సంతోషాన్ని పంచుకున్నారు. త‌న జీవితంలో ఈ రోజు మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలో కొలువు తీరిన ఈ పుణ్య క్షేత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు న‌రేంద్ర మోదీ. అనంత‌రం శ్రీ‌శైలంలోని శివాజీ మ్యూజియంను సంద‌ర్శించారు. అక్క‌డి నుంచి క‌ర్నూలుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

  • Related Posts

    నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి

    తిరుపతి : గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయ బద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్ శనివారం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. టిటిడి, దాస సాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి…

    అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

    తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *