శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో జ‌నార్థ‌న్‌ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మ‌న్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 38 మంది అధికారులు, 281 మంది ఉద్యోగులకు, స్విమ్స్‌లో 6 మంది, ఎస్వీబీసీలో 6 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసా పత్రం అందజేశారు.

అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు 4,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు 2,116/- నగదు బహుమతులు అందజేశారు. ఇదిలా ఉండ‌గా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ఏ దేశమేగినా ఎందు కాలెడినా…..”, “ భవతు భారతి…”, “ అదివో అల్లదివో…” తదితర దేశభక్తి గీతాలకు చ‌క్క‌టి నృత్యం ప్ర‌ద‌ర్శించారు. వీరిని ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్.

  • Related Posts

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

    న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *