గతంలో కంటే తగ్గిన మద్యం షాప్స్ దరఖాస్తులు
అమరావతి : తెలంగాణ సర్కార్ ప్రకటించిన 2,620 మద్యం దుకాణాలకు ఆశించిన మేర స్పందన రాక పోవడం విస్తు పోయేలా చేసింది. కేవలం 90,000 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుండి వ్యాపారవేత్తలు కూడా తెలంగాణలో లైసెన్స్‌లు కోరుతూ దరఖాస్తులు సమర్పించడం విశేషం. చివరి గడువు నాటికి అంచనాల ప్రకారం మద్యం దుకాణాల కోసం దరఖాస్తుకు రూ. 3 లక్షల తిరిగి చెల్లించని రుసుము నిర్దేశించింది. దీని ద్వారా కనీసం రూ. 2,700 కోట్లు సంపాదించనుంది. ఇదిల ఉండగా దరఖాస్తులు లక్ష మార్కు దాటితే ఏకంగా సర్కార్ కు రూ.3,000 కోట్లు వస్తాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్క రోజే దాదాపు 50,000 దరఖాస్తులు వచ్చాయి, శనివారం అర్థరాత్రి నాటికి మరో 40,000 వస్తాయని అధికారులు అంచనా వేశారు. నాంపల్లిలోని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో, పూర్తి చేసిన ఫారమ్‌లతో పాటు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్‌లతో క్యూ కట్టారు. కాగా సాయంత్రం 5 గంటలకు ముందు చేరిన వారికే ప్రవేశం పరిమితం అయినప్పటికీ, రాత్రి 9.50 గంటల వరకు దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా జంట నగరాల నుండి అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేయడం విశేషం. ఒడిశాకు చెందిన పార్వతి కూడా ఉన్నారు, ఆమె తన తల్లి, సోదరితో కలిసి 30 కి పైగా దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది.






