సంబురాల‌కు దూరంగా శాంస‌న్ ప్ర‌శాంతంగా

Spread the love

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన క్రికెట‌ర్

అహ్మ‌దాబాద్ : త‌ను ఏమిటో త‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు సంజు శాంస‌న్ గురించి. త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కొన్ని మ్యాచ్ లు ఆడ‌డం లేదంటూ త‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టారు. కానీ ఎక్క‌డా మ‌నో ధైర్యాన్ని కోల్పోలేదు. గాయాల‌ను, అవ‌మానాల‌ను, క‌ష్టాల‌ను అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. ఒంట‌రి పోరాటం చేశాడు. చివ‌ర‌కు భార‌త జ‌ట్టు క‌ల‌ను సాకారం చేశాడు. ఇవాళ 143 కోట్ల మంది భారతీయులంతా ముక్త కంఠంతో నిన‌దిస్తున్నారు సంజు శాంస‌న్ మా వోడు అని. తాజాగా త‌ను వైర‌ల్ గా మారాడు.

అహ్మదాబాద్ వేదిక‌గా కీవీస్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో త‌ను 89 ర‌న్స్ చేశాడు. అంతే కాదు 321 ప‌రుగుల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. క‌ప్ గెలుపొందాక ఆట‌గాళ్లు అంద‌రూ సంబురాల‌లో మునిగి పోతే తాను మాత్రం ఒక్క‌డే ఒక చోట కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైర‌ల్ గా మారాయి. ఒక మూలలో కూర్చుని అందరినీ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. అతను పరిగెత్తలేదు, అతిగా జరుపుకోలేదు. ప్రశాంతంగా, వినయంగా ఉన్నాడు. అప్పుడు హర్ష భోగ్లే సాబ్ అతని దగ్గరకు నడిచాడు. సంజు వెంటనే గౌరవంగా లేచి నిలబడి, అతనితో కాసేపు మాట్లాడి, మళ్ళీ కూర్చున్నాడు.

  • Related Posts

    చెన్నై సూప‌ర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్

    Spread the love

    Spread the loveముంబై ఇండియ‌న్స్ పై గ్రాండ్ విక్ట‌రీ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ ఓడి పోయి…

    ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాం : పాండ్యా

    Spread the love

    Spread the loveప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు బాగా ఆడింది ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *