ఉందని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
మెల్ బోర్న్ : ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారని, దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ సంస్థ నాయకత్వం మొదట వచ్చినప్పుడు తాను స్వయంగా వాళ్లను తీసుకెళ్లి ప్రాజెక్ట్ వచ్చే స్థలాన్ని చూపించానని తెలిపారు. తర్వాత నేను వారి కార్పోరేట్ కార్యాలయానికి వెళ్లి ఎందుకు ఏపీని ఎంచుకోవాలనే అంశంపై వారిని ఒప్పించానని చెప్పారు. తర్వాత గూగుల్ నాయకత్వం వచ్చి ముఖ్యమంత్రిని ఏపీలో కలిశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కొన్ని మార్పులు చేయాలని వారు కోరారు. ప్రధానమంత్రి మోదీ , కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడి అవసరమైన విధాన పరమైన సవరణలు చేశాం అన్నారు. దీంతో గూగుల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. భారతదేశం గ్లోబల్ డేటా సెంటర్ హబ్ గా ఎదిగేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు నారా లోకేష్.
ఆ ప్రాజెక్ట్ ను మేం 13 నెలల్లోనే పూర్తిచేశాం. మేం చెప్పిన సమయం కంటే ఒక నెల మాత్రమే ఆలస్యమైంది. నెల ఆలస్యంపై ఇప్పటికీ మేం బాధ పడుతుంటాం. ఆదిత్య మిట్టల్, నాకు మధ్య ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెల్లర్ మిట్టల్ ఏపీకి వచ్చిందన్నారు. ఇందుకు కావాల్సిన అనుమతులపై ప్రధాని మోదీ తో చర్చించి మార్గం సుగమం చేశామన్నారు. నవంబర్ లో ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నాం. 15 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ఏపీకి వచ్చిందని తెలిపారు నారా లోకేష్.
గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. దేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ కు మేం మీ వెంటే ఉంటాం. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మీ ప్రతి ఆలోచన, ప్రాజెక్ట్ కు మేం పూర్తి మద్దతు ఇస్తాం. మీ పెట్టుబడుల గమస్థానంలో ఏపీని ఎందుకు ఎంచు కోవాలనేందుకు మూడో కారణం.. మాది జాతీయ దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు.






