దీక్ష విర‌మించిన క‌ల్వ‌కుంట్ల క‌విత

కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ ఫైర్

హైద‌రాబాద్ : వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చేత మాజీ న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర‌య్య నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష చేప‌ట్టారు. భూదాన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో పేదలకే అప్పగించాలని ఈ సంఘటనను తాము సీరియస్ గా తీసుకున్నాం అన్నారు. ఖమ్మం పెద్ద ఎత్తున ధర్నా చేశాం అన్నారు. ఆ తర్వాత అప్పటికప్పుడు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. పోలీసులు విశారదన్ మహారాజ్ ని, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఎక్కడ మమ్మల్ని వదిలేశారో అక్కడే మేము దీక్ష కొనసాగించాం అన్నారు.

మీడియా, అధికారులు మా పక్షానే ఉన్నారన్న ధీమాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేసిందని ఆరోపించారు. అందుకే దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భూమి ఆక్రమించుకున్నారని మొన్నటి వరకు చెప్పిన మంత్రులు…ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అర్హులు ఉన్నారని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు క‌విత‌. పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను వెకేట్ చేయించామని ట్వీట్ చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇళ్లు కూలగొట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యం అని ప్ర‌శ్నించారు క‌విత‌. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరిగే రాహుల్ గాంధీ దీనికి బాధ్యత వహించాలన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *