కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం
ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచడంపై తన భార్య దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ కు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భార్య గీతాంజలి జె ఆంగ్మో సవరించిన అభ్యర్థనను బెంచ్ అనుమతించింది. జోధ్‌పూర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న కార్యకర్తకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల నవంబర్ 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం.
వాతావరణ కార్యకర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో దాఖలు చేసిన సవరించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం నమోదు చేసింది . కేంద్రం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం పది రోజుల్లోగా స్పందించాలని కోరింది. సవరించిన పిటిషన్‌కు ప్రతిస్పందనను దాఖలు చేయాలని కేంద్రం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం కోరింది .
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని సెంట్రల్ జైలులో ప్రస్తుతం ఉన్న వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేయడానికి అదనపు కారణాలతో సవరించిన పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరుతూ అంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 15న సుప్రీంకోర్టు వాయిదా వేసింది.






