newsseals.com
SPORTS

సంజు సామ్సన్ రియ‌ల్ మ్యాచ్ విన్న‌ర్

VijayaBhaskar March 7, 2026
newsseals-RaviShashtri
Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కెప్టెన్ , కోచ్

ముంబై : భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్, కోచ్ , క్రికెట్ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఇండియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టును ఫైన‌ల్ దాకా తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌న‌ను అనూహ్యంగా త‌ప్పించారు. చివ‌ర‌కు అనుకోకుండా ద‌క్కిన ఛాన్స్ తో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్ర‌ధానంగా ఓడి పోతుందని అనుకున్న స‌మ‌యంలో కోల్ కతా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో వెస్టిండీస్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. త‌ను కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 97 ప‌రుగులు చేశాడు. జ‌ట్టును చివ‌రి బంతి వ‌ర‌కు ఉంటూ గెలిపించాడు. సెమీ ఫైన‌ల్ దాకా తీసుకు వ‌చ్చాడు.

ఇదే క్ర‌మంలో ముంబై వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. త‌ను కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 8 ఫోర్లు 7 భారీ సిక్స్ ల‌తో విరుచుకు ప‌డ్డాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. త‌న కార‌ణంగానే ఇండియా ఇవాళ ఫైన‌ల్ కు చేరుకుంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సంద‌ర్బంగా ర‌విశాస్త్రి స్పందించాడు. సంజూ శాంస‌న్ మామూలు ఆట‌గాడు కాద‌ని, త‌ను రియ‌ల్ మ్యాచ్ విన్న‌ర్ అని ప్ర‌శంసించాడు. అతని వయస్సు ఇంకా 31 సంవత్సరాలు. మీరు ఈ రోజు ఆడే అలాంటి షాట్లను చూసినప్పుడు, అక్కడ క్లాస్ ఉంది, అక్కడ టచ్ ఉంది, అక్కడ పవర్ ఉంది, బ్రూట్ ఫోర్స్ ఉంది. ఇది నమ్మశక్యం కాదన్నాడు.