జ‌స్ప్రీత్ బుమ్రా, సంజు శాంస‌న్ సింప్లీ సూప‌ర్

Spread the love

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇండియా సెమీ ఫైన‌ల్ లో గెల‌వ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు. ప్ర‌ధానంగా ఇద్ద‌రు ఆట‌గాళ్లు కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని చెప్పాడు. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు ఒక‌రు స్పీడ్ స్ట‌ర్ బౌల‌ర్ గా పేరు పొందిన జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రొక‌రు కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ అని పేర్కొన్నాడు. శ‌నివారం క‌పిల్ దేవ్ మీడియాతో మాట్లాడాడు. ఇది క్రికెట్ ఆటకు లభించిన విజయం అని పేర్కొన్నాడు క‌పిల్ దేవ్. అతను (జస్ప్రీత్ బుమ్రా) ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్ అని నేను భావిస్తున్నానని చెప్పాడు.

ఒత్తిడిలో అతను ఎలా రాణిస్తాడో చూస్తే, అతను గౌరవానికి అర్హుడని పేర్కొన్నాడు . గత రెండు మ్యాచ్ ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న అద్బుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడంటూ సంజు శాంస‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు క‌పిల్ దేవ్. త‌ను ఆడిన షాట్స్ త‌న‌ను కూడా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేలా చేశాయ‌ని తెలిపాడు. ఇంకా విజ‌యానికి కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామ‌ని, చివరి మ్యాచ్ మిగిలి ఉందన్నాడు క‌పిల్ దేవ్. అవును, వ్యక్తులు ముఖ్యం, కానీ ఒక జట్టు ఆడినప్పుడు, మీరు విజయాన్ని చూస్తారని పేర్కొన్నాడు.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *