పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థి గెలుపొందారు. కాగా ఇటీవలే సదరు వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన తరపున తన భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే తను నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గంలో 81 మంది నామినేషన్లు ఖరారయ్యాయి. ఈ విషయాన్ని ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
బరిలో ఎందరు ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారంలో మునిగి పోయారు. ఇందులో కేటీఆర్, హరీశ్ రావులు తమ భుజాలపై వేసుకుని ముందుకు తీసుకు వెళుతున్నారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ కూడా పాల్గొన్నారు . తనను గెలిపించాలని ఆమె ఓటర్లను, స్థానికులను కోరారు.






