రిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు క‌రువు : క‌విత

Spread the love

ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఎమ్మెల్సీ

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రిమ్స్ ఆస్ప‌త్రిని సందర్శించారు. అక్క‌డ క‌నీస వ‌స‌తులు లేక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీనిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అక్క‌డ ప‌ని చేస్తున్న డాక్ట‌ర్లు, ఇత‌ర సిబ్బందితో మాట్లాడారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు .

ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోగులు, వైద్యులు, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత, పారిశుధ్యం, వైద్య సిబ్బంది ,ప్రాథమిక సౌకర్యాలకు తక్షణ శ్రద్ధ అవసరమని తన ప‌రిశీల‌న‌లో తేలింద‌ని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ జిల్లాలో గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నందున, తక్ష‌ణ‌మే కార్డియాలజిస్ట్‌ను నియమించాలని ఆమె కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కోరారు.

నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే క‌నీస వ‌స‌తి సౌక‌ర్యాల‌పై దృష్టి సారించాల‌ని అన్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    Spread the love

    Spread the loveధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఇంకా కేవ‌లం 48 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది ఎన్నిక‌ల పోలింగ్ చేప‌ట్టేందుకు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో నువ్వా నేనా…

    ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *