ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా ఆపేయాలి

సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

తిరుప‌తి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం తిరుప‌తి జిల్లాలో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మంగ‌ళంను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఎనిమిది గో డౌన్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎర్ర చంద‌నం దుంగ‌ల వివ‌రాల‌ను ప‌రిశీలించారు. ఇదే స‌మ‌యంలో పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను త‌క్ష‌ణ‌మే త‌న‌కు అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్బంగా ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌కు షాక్ ఇచ్చారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆపేయాలని, లేని పక్షంలో ఆపరేషన్ కగర్ తరహాలో స్మగ్లర్లను ఏరి వేయడానికి ఆపరేషన్ మొదలు పెడతామని హెచ్చరించారు. ఉపాధి కోసం ఎర్ర చందనం చెట్లు నరికివేసే వారు ఇకపై స్థానిక అధికారులను సంప్రదించాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వేరే ఉపాధి మార్గాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *