బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారా లోకేష్

ఎన్డీయే త‌ర‌పున మంత్రి క్యాంపెయిన్

అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇందులో భాగంగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు చెందిన ప్ర‌ధాన నేత‌లంతా బీహార్ బాట ప‌ట్టారు. మ‌రో వైపు మ‌హా కూట‌మి కూడా ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇస్తోంది. ప్ర‌ధానంగా రాహుల్ గాంధీ, తేజ‌స్వి యాద‌వ్, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాద‌వ్ లు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు.

ఇప్ప‌టికే తొలి విడ‌త పోలింగ్ ముగిసింది. రెండో విడ‌త పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ప్ర‌ధాని మోదీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌నే స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉన్నారు. మ‌రో వైపు ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్బంగా బీహార్ లోని పాట్నా లో ఎన్డీయే సంకీర్ణం త‌ర‌పున బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల త‌ర‌పున క్యాంపెయిన్ చేప‌డ‌తారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *