హిట్ల‌రే అడ్ర‌స్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?

సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు

హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగి , న‌ర‌హంత‌కుడిగా పేరు పొందిన హిట్ల‌ర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడ‌ని ఇక ఇదే ప‌వ‌ర్ ను చూసుకుని అడ్డ‌గోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నువ్వెంత అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా అభ్య‌ర్థి మాగంటి సునీత‌తో క‌లిసి ఎర్ర‌గ‌డ్డ‌లో రోడ్ షో చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎంపై. బీఆర్ఎస్ లీడ‌ర్ ష‌రీఫ్‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లి కండువా క‌ప్పారని ఆరోపించారు. త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లను బెదిరింపుల‌కు గురి చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇలాంటివి చేయ‌డానికి కాంగ్రెస్ నేత‌ల‌కు సిగ్గుండాలని అన్నారు కేటీఆర్. ద‌మ్ముంటే ఎన్నిక‌ల్లో పోరాడాలని స‌వాల్ విసిరారు. ప‌దేళ్ల‌లో కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ఎలా చూసుకున్నారో అంద‌రికీ తెలుసు అన్నారు.

పేదింటి ఆడ‌బిడ్డ పెళ్లికి క‌ల్యాణ‌ల‌క్ష్మితో రూ. ల‌క్ష ఇచ్చారని, మ‌గ‌బిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడ‌బిడ్డ పుడితే రూ. 13 వేలు అందించామ‌ని అన్నారు. ల‌క్షా 50 వేలా ప‌ట్టాలు అందించిన ఘ‌న‌త కేసీఆర్‌దేన‌ని అన్నారు కేటీఆర్. ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను క‌ట్టించిన ఘ‌న‌త కూడా త‌మ‌దేన‌ని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుస‌లి వ‌ర‌కు అంద‌రినీ బాగా చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు ఐటీ సెక్టార్ లో 3 ల‌క్ష‌ల మంది ప‌ని చేస్తుంటే తాము వ‌చ్చాక ఆ సంఖ్య‌ను 13 ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని అన్నారు కేటీఆర్. యాపిల్‌, గూగుల్‌, అమెజాన్ వంటి ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లు హైద‌రాబాద్‌కు వ‌చ్చాయన్నారు. 420 అబ‌ద్దాలు చెప్పారు, ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు గ‌మ‌నించి బీఆర్ఎస్ కు ఓటు వేయాల‌ని, కాంగ్రెస్ కు బుద్ది చెప్పాల‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *