శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

VijayaBhaskar · November 9, 2025
Spread the love

పెద్ద ఎత్తున హాజ‌రైన భ‌క్తులు

తిరుపతి : తిరుపతి లోని సుప్ర‌సిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామి వారిని అర్చించారు.

సాయంత్రం శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామి వారి ఉత్సవ మూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ల‌క్ష బిల్వార్చ‌న సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఈ కార్య‌క్రమానికి భ‌క్తులు హాజ‌ర‌య్యారు. బిల్వా ర్చ‌న కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నారు.