సుస్థిరాభివృద్దిలో భాగ‌స్వామ్యం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌పట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో ప్ర‌దానంగా చర్చించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్మేనియా ఆర్థిక వ్యవహరాల మంత్రి గివార్గ్ పొపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన ఛైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హజరయ్యారు. ఈసంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు , ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకుంది స‌ర్కార్.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *