16న‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

Spread the love

శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ల‌క్ష కుంకుమార్చ‌న‌

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుండి 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌ కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ వ‌చ‌నం, ర‌క్షా బంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఆలయంలో న‌వంబ‌రు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మ‌ధ్య ధనుర్ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

18వ తేదీ ఉద‌యం పెద్ద శేషవాహనం, రాత్రి హంస వాహనం , 19వ తేదీన ఉద‌యం ముత్యపు పందిరి వాహనం , రాత్రి సింహ వాహ‌నం, 20వ తేదీన ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి హ‌నుమంత వాహ‌నం,
21వ తేదీన ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి గ‌జ వాహ‌నం, 22న ఉద‌యం సర్వ భూపాల వాహనం , సాయంత్రం స్వ‌ర్ణ ర‌థం, రాత్రి గరుడ వాహ‌నం, 23న ఉద‌యం సూర్య ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 24న ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి అశ్వ వాహ‌నం, 25న ఉద‌యం పంచ‌మీ తీర్థం, రాత్రి ధ్వ‌జావ రోహ‌ణం నిర్వ‌హిస్తారు.

  • Related Posts

    క‌ళ్యాణ మండ‌పం ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తా

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయ‌ణ‌పేట జిల్లా : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ…

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *