మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రి , సీజే

విశాఖ‌పట్నం : ఏపీలోని విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక‌గా కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన సీఐఐ భాగ‌స్వామ్య స‌దస్సు కొన‌సాగుతోంది. పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స‌ద‌స్సులో భాగంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే , విశాఖపట్నంలోని జేమ్స్ కుక్ విశ్వ విద్యాలయం ప్రతినిధులను కలవడం ఆనందంగా ఉందన్నారు ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్‌. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణ మండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని చర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన సమూహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, నీటి నిర్వహణలో తమ యువతకు ఉమ్మడి శిక్షణను కూడా ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు మంత్రి నారా లోకేష్. త‌మ కూట‌మి స‌ర్కార్ రూ. 10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఆ దిశ‌గా తాము స‌క్సెస్ అయ్యామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో స‌మర్థ‌వంతుడైన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోంద‌ని అన్నారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *