సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ప్ర‌పంచంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ దార్శ‌నిక సాంకేతిక నిపుణుడిగా త‌ను గుర్తింపు పొందారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్ , హోలోలెన్స్‌లను సృష్టించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిప్‌మాన్ మానవ-కంప్యూటర్ పరస్పర చర్యను పునర్నిర్వచించడంలో మార్గ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో తదుపరి తరం ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి సంభావ్య సహకారాల గురించి సీఎం చ‌ర్చించారు అలెక్స్ కిప్ మాన్ తో.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పట్టణ వరదలు, వాతావరణ మార్పుల అంచనాను వారి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిష్కరించడంలో అనలాగ్ AI ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈసంద‌ర్భంగా సీఎం కీల‌క సూచ‌న చేశారు త‌న‌తో. త‌మ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వ‌చ్చే డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, కంపెనీల సీఈఓలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు , క‌న్స‌ల్టెంట్స్ హాజ‌ర‌వుతున్నార‌ని, మీరు కూడా రావాల‌ని అలెక్స్ కిప్ మాన్ ను ఆహ్వానించారు.

  • Related Posts

    ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల కేంద్రంగా తెలంగాణ : సీఎం

    హైద‌రాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో…

    రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన జ‌ర్న‌లిస్టులు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధ‌వారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *