కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి తెర పైకి మ‌రోసారి ఫార్ములా వ‌న్ కార్ రేసు కేసు ముందుకు వ‌చ్చింది. ఇదే కేసుకు సంబంధించి ప‌లుమార్లు అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ముందు హాజ‌ర‌య్యారు. తాను ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని ఈ సంద‌ర్బంగా ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. అయితే ఈ కేసులో రూ. 54.88 కోట్లు చేతులు మారాయ‌ని ఏసీబీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని అంటోంది.

ఇదిలా ఉండ‌గా కేటీఆర్ ప్ర‌స్తుతం సిరిసిల్ల నియోజ‌క‌వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ స‌మ‌యంలో త‌న‌ను అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీక‌ర్, గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. విచార‌ణ జ‌రిపేందుకు, అదుపులోకి తీసుకునేందుకు త‌మ‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని ఏసీబీ ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించింది. ఈ మేర‌కు విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించింది. ఇందులో భాగంగా ఫైల్ ను ప‌రిశీలించిన గ‌వ‌ర్న‌ర్ గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేటీఆర్ ను విచార‌ణ జ‌రిపేందుకు గాను ఏసీబీకి అనుమ‌తి ఇచ్చారు. దీంతో త‌న‌పై ఛార్జిషీట్ దాఖ‌లు చేసేందుకు రెడీ అయ్యింది ఏసీబీ. దీంతో త‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *