వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

Spread the love

మూడు వారాల్లో రూ. 7 కోట్లు వ‌సూలు

నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన త‌ను గ్రామీణ ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ సంఘ‌ట‌న ఆధారంగా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇందులో న‌టించిన న‌టీ న‌టులు సైతం త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు యువ‌త‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసింది. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్, స‌మీక్ష‌లు కూడా బాగుందంటూ పేర్కొన‌డంతో ప్ల‌స్ పాయింట్ అయ్యింది సినిమాకు.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాను బ‌న్నీ వాసు, వంశీ నందిపాటి నిర్మించారు. వీరు చేసిన ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఎక్క‌డా టికెట్ ధ‌ర‌లు పెంచేందుకు ఇష్ట ప‌డ‌లేదు. ఇదే వ్యూహం ఫ‌లించింది. వారికి కాసుల వ‌ర్షం కురిపించేలా చేసింది. భారీ ఎత్తున వ‌సూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ అస్తిత్వం, న‌టీ న‌టుల స‌హ‌జ‌త్వం ఈ సినిమా కు హైలెట్ గా నిలిచాయి. బిగ్ స‌క్సెస్ అయ్యేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా టికెట్ ధ‌ర‌లు పెంచ‌క పోవ‌డం వ‌ల్లే సినిమా స‌క్సెస్ కాలేద‌ని, కానీ చిత్రంలో కంటెంట్ అద్భుతంగా ఉండ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు సినీ విమ‌ర్శ‌కులు.

  • Related Posts

    మెగాస్టార్ మూవీలో త‌ళుక్కుమ‌న్న ర‌మా నంద‌న

    Spread the love

    Spread the loveనందూస్ వ‌ర‌ల్డ్ పేరుతో యూట్యూబ‌ర్ గా ఫేమ‌స్ హైద‌రాబాద్ : టెక్నాల‌జీ మారింది. డిజిట‌ల్ మీడియా వ‌చ్చాక అవ‌కాశాలు అపారంగా పెరిగాయి. ఎవ‌రైనా స‌రే త‌మ టాలెంట్ తో ఒక్క రోజులోనే పాపుల‌ర్ అవుతున్నారు. ఇందుకు సాక్ష్యం తాజాగా…

    మెగాస్టార్ మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ ఖుష్

    Spread the love

    Spread the loveత‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది గుంటూరు జిల్లా : మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, అందాల తార న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సంచ‌లనం రేపుతోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *