సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

Spread the love

ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి కేపీ రాధాకృష్ణ‌న్ , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, అనుముల రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. వీరంతా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. నూత‌న సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విశిష్టమైన, ప్రభావవంతమైన పదవీకాలం ఉండాలని
కోరారు.

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ సూర్య‌కాంత్ 53వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొలువు తీరారు. త‌న తండ్రి ఓ రైతు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత భావోద్వేగానికి లోన‌య్యారు. సంత‌కం చేసిన వెంట‌నే కీల‌క‌మైన తీర్పులు వెలువ‌రించారు. ఈ సంద‌ర్బంగా పేద‌ల‌కు స‌త్వ‌ర న్యాయం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌ర కేసులు విచారించే సంద‌ర్బంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్. ఇక నుంచి మౌఖికంగా కాకుండా లిఖిత పూర్వ‌కంగా ఆర్జీలు ఇవ్వాల‌ని ఆదేశించారు రిజిస్ట్రార్ ను.

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

    Spread the love

    Spread the loveసామాజిక సేవ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైద‌రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా…

    దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆర్డీటీ విష‌యంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *