మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినంద‌న

Spread the love

ప్ర‌శంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్

అమ‌రావ‌తి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న కనక పుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఉండవల్లి నివాసానికి విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మంత్రి మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా విద్యార్థిని ప్ర‌శంసించారు. చ‌దువుపై మ‌రింత‌గా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, జీవితంలో ఎద‌గాలంటే విద్య ఒక్క‌టే మార్గ‌మ‌న్నారు. స‌క్సెస్ కు ద‌గ్గ‌రి దారులంటూ లేనే లేవ‌న్నారు. క‌ష్ట ప‌డ‌టం, శ్ర‌మ‌ను న‌మ్ముకుంట‌నే విజ‌యం వ‌రిస్తుంద‌న్నారు. ఎవ‌రిపై దేబ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని, చ‌దువుపై ఫోక‌స్ పెడితే స‌మాజ‌మే మిమ్మ‌ల్ని గుర్తిస్తుందని చెప్పారు నారా లోకేష్‌. భ‌విష్య‌త్తులో మ‌రింత ఎదిగేందుకు తాము స‌హాయ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.

  • Related Posts

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    Spread the love

    Spread the loveఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    Spread the love

    Spread the loveనిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *