వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

Spread the love

డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించారు. గురువారం జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులతో ములాఖ‌త్ అయ్యారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డీపీఆర్ ఉంచాలన్నారు. ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముందని అన్నారు క‌విత‌. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కానీ , ప్ర‌స్తుతం 420 హ‌మీల‌తో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ కానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఆరోపించారు. కొలువు తీరి రెండు ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు డీపీఆర్ త‌యారు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు ఏళ్లుగా పెండింగ్ లో ఉండ‌డాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. త‌మ కార్య‌క్ర‌మం ఉంద‌ని తెలిసి హ‌డావుడిగా మోటార్లు బిగించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు క‌విత‌. అంతకు ముందు పూర్తిగా పంప్ హౌస్ లను బంద్ పెట్టిన పరిస్థితి ఉంద‌న్నారు. పనుల పేరు చెప్పి హేవీ వెహికల్స్ వస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చాలా మంది రైతులు ప్రాజెక్ట్ కారణంగా అర, పావు ఎకరం భూమి కోల్పోతున్నారని వాపోయారు. క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ‌మే ఇక్క‌డికి వ‌చ్చి, రైతులు ఎదుర్కొంటున్న బాధ‌ను వినాల‌ని సూచించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వారికి ఏం నష్ట పరిహారం ఇస్తారో చెప్పాల్సి ఉందన్నారు. గతంలో ఎకరానికి రూ. 17 లక్షలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ధరలు పెరిగాయన్నారు. ఐతే ఎకరానికి ఎకరం ఇవ్వండి, లేదా ఎకరానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని రైతులు అడుగుతున్నారని అన్నారు క‌విత‌.

  • Related Posts

    బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది

    Spread the love

    Spread the loveరాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని…

    వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు

    Spread the love

    Spread the loveఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *