నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌

అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (TBC) వ్యవస్థలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు అంశాలపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎల్‌సీ (HLC) , మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ప్రస్తుత పరిస్థితి, లైనింగ్ లేమి, నీటి లీకేజీలు, చెరువుల నింపుదల, , రైతులకు నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గంలో వ్యవసాయం పూర్తిగా ఈ నీటిపారుదల వ్యవస్థలపై ఆధారపడి ఉండటంతో, నిర్వహణ పనులు అత్యవసరమని అధికారులు వివరించారు.

శిoగనమల నియోజకవర్గానికి చెందిన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నీటిపారుదల వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, వాటి పరిష్కారం ద్వారా నీటి వినియోగాన్ని మెరుగు పరచడం, చెరువుల నింపుదల, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. నీటి వినియోగదారుల సంఘాల సమన్వయంతో ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *