చేనేత కార్మికుల‌కు స‌ర్కార్ చేయూత

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ చేనేత రంగం బ‌లోపేతం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. మంగళగిరి పట్టణం లోని రాజీవ్ సెంటర్ లో బిట్ర తులసీరామ్, అందె వీరాంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు మంత్రి నారా లోకేష్. నిత్యం శ్ర‌మించే నేత‌న్న‌ల అభివృద్ది కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. చేనేత‌, జౌళి శాఖ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల‌లో స్టాల్స్ ను, ఎగ్జిబిష‌న్ సెంట‌ర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల ఉపాధి క‌ల్పించేలా చూస్తున్నామ‌న్నారు. అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రు చేనేత దుస్తులు ధ‌రించేలా చూడాల‌ని సూచించారు. దీని వ‌ల్ల చేనేత రంగంపై ఆధార‌పడిన వారికి మేలు చేకూరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *