కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారు

ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ : ఖ‌మ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌద‌రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు సోమ‌వారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఆమె త‌న‌తో పాటు పెంపుడు కుక్క‌ను తీసుకు వెళ్లారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు బీజేపీ ఎంపీలు. ఆపై రేణుకా చౌద‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై ఎంపీ సీరియ‌స్ గా స్పందించింది. వాళ్ల‌కు బుద్ది లేద‌న్నారు.

ఆపై త‌న పెంపుడు కుక్క‌ను తీసుకు రావ‌డంలో త‌ప్పు ఏమీ లేద‌ని చెప్పింది. ఆపై అది మీలాగా క‌రిచే కుక్క కాద‌న్నారు రేణుకా చౌద‌రి. విచిత్రం ఏమిటంటే గ‌తంలో పార్ల‌మెంట్ లో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చేవ‌న్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. కేవ‌లం క‌రిచే కుక్క‌లు పార్ల‌మెంట్ లో కొలువు తీరాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేణుకా చౌద‌రి. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీలు. ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఒక ఎంపీగా బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న త‌ను ఇలాగేనా తోటి ఎంపీల‌పై కామెంట్స్ చేసేది అంటూ ఫైర్ అయ్యారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *