డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈనెల 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి టీంతో మెస్సీ టీం తలపడనుంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సీఎం ఫుల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఎలాగైనా మెస్సీ టీంపై గెలవాలని. పూర్తిగా కసరత్తు చేస్తూనే ఇంకో వైపు పాలనా పరంగా సమీక్షలు చేపట్టారు. ఇవాల్టి నుంచి 6వ తేదీ వరకు ప్రజా వారోత్సవాలను పురస్కరించుకుని ఆయా జిల్లాల్లో జరిగే సమావేశాలకు హాజరవుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లో 9వ నెంబర్ జెర్సీతో సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. ఇక ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ 10వ నెంబర్ జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి వస్తారు. ఇప్పటికే సీఎంతో కూడిన ఫుట్ బాల్ టీం ప్రాక్టీస్ లో మునిగి పోయింది. అవతల తలపడ బోయేది సామాన్యమైన ఆటగాడు, టీం కాదు. ఆ టీంను ఎదుర్కోవాలంటే చాలా దమ్ముండాలి. ఈ మేరకు 13న జరగబోయే ఈ కీలకమైన మ్యాచ్ కోసం చాలా మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.








