ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్

కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను మీడియాతో మాట్లాడారు. వికెట్ కీప‌ర్ గా ఉన్న సంజూ శాంస‌న్ ను త‌ప్పించి ఇషాన్ కిష‌న్ ను ఉప‌యోగించార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. ఈ రోజు మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు కదా, మరి ఈ రోజు ఇషాన్ కిషన్ ఎందుకు వికెట్ కీపింగ్ చేశాడ‌ని అడిగిన మీడియాకు దిమ్మ తిరిగేలా ఆన్స‌ర్ ఇచ్చాడు.

ఈ సిరీస్ ప్రారంభంలో, మూడు మ్యాచ్‌లకు సంజూ శాంస‌న్ ను , ఒక మ్యాచ్‌కు ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్‌గా ఉంచాలని తాము ముందే ప్లాన్ చేసుకున్నామ‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్. గాయం కారణంగా ఇషాన్ కిషన్ గత మ్యాచ్ ఆడలేక పోవడంతో, సంజూ వికెట్ కీపింగ్ చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మాకు అవకాశం లభించడంతో, ఇషాన్ కిషన్‌తో వికెట్ కీపింగ్ చేయించడం జ‌రిగింద‌న్నాడు. కావాల‌ని శాంస‌న్ ను త‌ప్పించ లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌ను కూడా త‌మ టీంలో స‌భ్యుడిగా ఉంటాడ‌ని చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా శాంస‌న్ కు 5 మ్యాచ్ ల‌లో ఆడేందుకు అవ‌కాశం ఇచ్చారు హెడ్ కోచ్ గంభీర్. త‌ను ఈ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోయాడు. త‌ను 10, 6, 0, 24, 6 ప‌రుగులు చేశాడు. దీంతో రాబోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న‌కు బ‌దులు ఇషాన్ కిష‌న్ ను వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించాడు గంభీర్.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *