సచివాలయంలో సమీక్ష చేపట్టిన చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన నూతన పౌర సేవలకు సంబంధించి ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది అనేది లేకుండా చూడాలని అన్నారు సీఎం. ప్రత్యేకించి ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత కీలకమని స్పష్టం చేశారు . దీని వల్ల మరింత పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కూటమి సర్కార్ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. మొత్తం పౌర సేవలను పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో వాట్సాప్ ద్వారానే అందించడం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి. దీని వల్ల శ్రమ ఉండదని, టైం సేవ్ అవుతుందన్నారు. ఏయే శాఖలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, ఏ మాత్రం ఇబ్బంది పడినా తాను ఊరుకోనంటూ హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. పౌరుల సేవలకు సంబంధించి దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోల్ మోడల్ కావాలని స్పష్టం చేశారు.






