సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి
కటక్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టి20 కీలకమైన మ్యాచ్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సందర్బంగా బరాబతి స్టేడియంను శనివారం సందర్శించారు. ఇదిలా ఉండగగా డిసెంబర్ 9న కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరుకు వేదిక కానుంది. ఐకానిక్ వేదిక వద్ద భారీ సంఖ్యలో జన సమూహాన్ని నిర్వహించడానికి మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు సారంగి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు వచ్చాయని, ప్రస్తుతం పోలీస్ శాఖా పరంగా సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకున్నామన్నారు.
కీలకమైన టి20 మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడు పోయాయని తెలిపారు సారంగి. ఇదే సమయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఏదైనా సంఘటనకు సిద్ధం కావడానికి తాము ఇప్పటికే ఒడిశా క్రికెట్ అసోసియేషన్‌తో వివరణాత్మక చర్చలు జరిపామని వెల్లడించారు.స్టేడియం లోపల, చుట్టు పక్కల దాదాపు 350 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించామన్నారు. ఇరవై ఒక్క అగ్నిమాపక దళాలను వ్యూహాత్మకంగా ఉంచుతామని స్పష్టం చేశారు.






