మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ తెలంగాణ‌లో కాలు మోప‌నున్నాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌తాడు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ‌మే ఏర్పాట్లు చేస్తోంది . ఈ కీల‌క మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క ప‌రిశీలించారు.

ఇదిలా ఉండ‌గా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం భద్రత, లాజిస్టిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతుండ‌డం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం. మ‌రోవైపు స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భార‌త్ సిటీ వేదిక‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను రేప‌టి నుంచి నిర్వ‌హిస్తోంది. డిసెంబ‌ర్ 8, 9వ తేదీల‌లో జ‌ర‌గ‌నున్న ఈ స‌మ్మట్ అనంత‌రం మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌నున్నారు రేవంత్ రెడ్డి. ఫుల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు త‌ను.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *