రైతులకు న్యాయం జరిగే వరకు భూముల్లోకి రావద్దు : మ‌ల్ల‌న్న‌

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ బాధిత రైతుల తరఫున అధికారులతో మాట్లాడారు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా వారితో భేటీ అయ్యారు. ఈ మేర‌కు వెంట‌నే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. .భూ పరిహారం పెంపునకు చర్యలు చేపట్టాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఎవ‌రికీ ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని అన్నారు . బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ బాధిత రైతులు కలిసి తమ సమస్యను వివరించారు.

రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరానికి ₹16.50 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇస్తోందని, అదే భూమి ప్రైవేట్ మార్కెట్‌లో ₹30 లక్షల వరకు విలువ చేస్తోందని రైతులు తమ ఆవేదన తెలిపారు. రైతుల సమస్యపై స్పందించిన తీన్మార్ మల్లన్న అక్కడి నుంచే జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు న్యాయమైన పరిహారం అందించాలి. వారికి న్యాయం జరిగే వరకు వారి భూముల్లోకి వెళ్లొద్దు అని అధికారులకు స్పష్టం చేశారు.

విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఇంతకు ముందు నిర్ణయించిన ధర ఎకరాకు (16,50,000) కాకుండా ఆ నష్ట పరిహారాన్ని (enhancement) మరింత పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. తమ పక్షాన నిలబడ్డ తీన్మార్ మల్లన్నకి భూబాధితులు ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    మ‌హిళ‌ల‌ను కించప‌రిస్తే చూస్తూ ఊరుకోం : విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌హిళ‌ల ప‌ట్ల ఎవ‌రు చుల‌క‌న చేసి మాట్లాడినా లేదా దూషించినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం. ఆదివారం తిరుప్పూర్ జిల్లాలో…

    చంచల్ గూడ సూపరింటెండెంట్ పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్

    హైద‌రాబాద్ : ఎంఐఎం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యుడు అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏకంగా హైద‌రాబాద్ లోని చంచ‌ల్ గూడ జైలు సూపరింటెండెంట్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆదివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *