టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. పరకామణి చోరీ కేసులో భగవంతుడి సొమ్ము దోచుకున్న వారిని వెనకేసుకు రావడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ ఇచ్చిన వాంగూల్మం పై స్పందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఓ వైపు తను మహాపాపం చేశానంటూ ఒప్పుకుంటే ఇంకో వైపు ఖండించాల్సింది పోయి అది నేరమే కానట్టు జగన్ రెడ్డి పేర్కొనడం పట్ల ఫైర్ అయ్యారు బుద్దా వెంకన్న. దీన్నిబట్టి చూస్తేంటే భగవంతుడి పై ఎంత నమ్మకం వుందో అర్ధమవుతుందన్నారు. పరకామణీ చోరీ కేసు చాలా చిన్నదని భక్తుల మనోభావాలు పట్టించు కోకుండా వ్యాఖ్యలు చేయటం సిగ్గులేని తననానికి నిదర్శనమన్నారు.
ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ కి పరకామణి చోరీ కేసు చిన్నగానే కనిపిస్తుందని అన్నారు. ఎందుకు అంతగా భుజాలు తడుము కుంటున్నాడంటూ ప్రశ్నించారు. తాను దొంగతనం చేశానని, పశ్చాత్తాపంతో వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తుల్లో 90 శాతం శ్రీవారికి రాసి ఇచ్చినట్లు రవి కుమార్ చెప్పటం చూస్తే తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివాడన్న విషయం క్లియర్ గా అర్ధమవుతుందన్నారు. వ్యాపారం ద్వారా అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రవికుమార్ కు పరకామణి లో చోరీ చేయాల్సిన అవసరం ఎందుకు వుంటుందని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.






