ప్రశంసించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీని ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్నారు ఈ సమ్మిట్ కు. సోమవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభిస్తారు. రెండో సెషన్ లో తెలంగాణ భవిష్యత్తు, ప్రణాళికలు, తమ సర్కార్ విజన్ ఏమిటో చెప్పేందుకు ప్రయత్నం చేస్తారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి. రూ. 100 కోట్లకు పైగా ప్రజా ధనంతో దీనిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్బంగా చెప్పారు రాష్ట్ర రెవిన్యూ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాట్లు చేశామన్నారు. డిసెంబర్ 8 మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభవుతాయని, డిసెంబర్ 9న మంగళావరం సాయంత్రం ముగుస్తాయన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వల్ల తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు .






