జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్తగా 65 విద్యుత్ బస్సులు వచ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే వీటిని తీసుకు రావడం జరిగిందని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. బుధవారం రాణిగంజ్ డిపోకు వచ్చిన కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ డిపోకు మొత్తం 100 బస్సులు కేటాయించాల్సి ఉందని, తొలి విడతగా 65 విద్యుత్ బస్సులను కేటాయించామని తెలిపారు. ఇంకా త్వరలోనే మిగిలి పోయిన 35 బస్సులను కేటాయిస్తామన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరీత, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 500 విద్యుత్ బస్సులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్తకు 325 బస్సులు వచ్చినట్లు తెలిపారు. మిగిలిన 175 బస్సులు జనవరి 2026 నాటికి ప్రవేశపెట్టబడతాయని తెలిపారు పొన్నం ప్రభాకర్. ఈ పురోగతితో, హైదరాబాద్ స్థిరమైన పట్టణ చలనశీలత వైపు విస్తృత మార్పునకు అనుగుణంగా కార్పొరేషన్ తన ఎలక్ట్రిక్ బస్సు నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరిస్తోందని చెప్పారు.






