స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్ర‌శంస‌లు కురిపించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. బుధ‌వారం ఓయులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.
గ‌త పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారని, కానీ నేను ఏనాడూ గుంటూరులో చ‌దువు కోలేద‌న్నారు. త‌న‌కు గూడు పుఠానీ చేయ‌డం రాద‌న్నారు.

నాకు విదేశీ భాష రాక పోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చని అన్నారు రేవంత్ రెడ్డి.
పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు అని చెప్పారు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ముఖ్య‌ ఉద్దేశం అన్నారు. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు . నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాన‌ని, ఇవాళ మీతో ఇలా మాట్లాడుతున్నాన‌ని చెప్పారు సీఎం. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష అని స్ప‌ష్టం చేశారు. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు.జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం .పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు .బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం .
ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేశామ‌న్నారు. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం .విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుందని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *