భార‌త్ స్క్వాష్ జ‌ట్టుకు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్

యావ‌త్ దేశాన్ని గ‌ర్వ‌ప‌డేలా చేసింద‌ని కితాబు

ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. SDAT స్క్వాష్ ప్రపంచ కప్ 2025లో చరిత్ర సృష్టించి, తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది భారత స్క్వాష్ జట్టు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా అభినందించారు. జోష్నా చినప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్ని, పట్టుదలను ప్రదర్శించడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. మీరు సాధించిన‌ విజయం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింద‌ని పేర్కొన్నారు. ఈ విజయం మన యువతలో స్క్వాష్ క్రీడకు ప్రజాదరణను కూడా పెంచుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల అభివృద్ది కోసం ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని స్ప‌స్టం చేశారు. ఇప్ప‌టికే అన్ని క్రీడా రంగాల‌కు అత్య‌ధికంగా బ‌డ్జెట్ ను కేటాయించామ‌న్నారు న‌రేంద్ర మోదీ. తాము చేస్తున్న ప్ర‌య‌త్నాలు అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చేలా చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు 25 ఏళ్ల సుదీర్ఘ అనంత‌రం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ 2025ను కైవ‌సం చేసుకుంద‌ని తెలిపారు. భార‌తీయ అమ్మాయిలు సాధించిన విజ‌యం అద్బుత‌మైని, అపూర్వ‌మని ప్ర‌శంస‌లు కురిపించారు.

  • Related Posts

    భార‌త్ పురుషుల హాకీ జ‌ట్టుకు సీఎం కంగ్రాట్స్

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ భార‌త మెన్స్ హాకీ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షల అని శివకుమార్ అన్నారు. భారతదేశానికి స్వర్ణం సాధించిన భారత పురుషుల…

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *