స‌త్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌త్త్వా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవ‌రున్నారో తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స‌త్త్వా ఐటీ కంపెనీ అని స‌ర్కార్ ఊద‌ర‌గొట్టింద‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఎలా ఈ సంస్థ‌కు కేటాయించారో చెప్పాల‌న్నారు గుడివాడ అమ‌ర్ నాథ్. రూ.1500 కోట్ల విలువ చేసే 30 ఎక‌రాల భూమి రూ.45 కోట్ల‌కు ఎందుకిచ్చారు, ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

సత్త్వా ఉద్యోగాలిచ్చే సంస్థ కానే కాద‌ని, అది అద్దెలకు ఇచ్చుకునే కంపెనీ అని అన్నారు. 90 రోజులు అయినా డ‌బ్బులు ఎందుకు క‌ట్ట‌లేదని ప్ర‌శ్నించారు. గ‌డువు ఎందుకు పెంచారు..?50 శాతం ఇన్సెంటివ్స్‌.. 50% భూమిలో గృహ నిర్మాణాల‌కు అనుమ‌తేంటీ..? ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు గుడివాడ అమ‌ర్ నాథ్. ఈ భూ పందెరాన్ని ఆపేందుకు పోరాటం చేస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ కూట‌మి స‌ర్కార్ కు. రాష్ట్రంలో పాల‌న సాగ‌డం లేద‌ని చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ

    Spread the love

    Spread the loveమాట నిల‌బెట్టుకున్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఆయ‌న ఇటీవ‌లే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సంద‌ర్శించారు. మత్స్య‌కారుల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇప్పిస్తాన‌ని చెప్పారు.…

    ఒక చోట ఆట స్థలం మరో చోట అధునాతన కిచెన్

    Spread the love

    Spread the loveఇచ్చిన హామీ నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన స‌మ‌యంలో కంప్యూట‌ర్లు, పుస్త‌కాలు లేని విష‌యాన్ని గ‌మ‌నించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *