స‌త్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌త్త్వా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవ‌రున్నారో తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స‌త్త్వా ఐటీ కంపెనీ అని స‌ర్కార్ ఊద‌ర‌గొట్టింద‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఎలా ఈ సంస్థ‌కు కేటాయించారో చెప్పాల‌న్నారు గుడివాడ అమ‌ర్ నాథ్. రూ.1500 కోట్ల విలువ చేసే 30 ఎక‌రాల భూమి రూ.45 కోట్ల‌కు ఎందుకిచ్చారు, ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

సత్త్వా ఉద్యోగాలిచ్చే సంస్థ కానే కాద‌ని, అది అద్దెలకు ఇచ్చుకునే కంపెనీ అని అన్నారు. 90 రోజులు అయినా డ‌బ్బులు ఎందుకు క‌ట్ట‌లేదని ప్ర‌శ్నించారు. గ‌డువు ఎందుకు పెంచారు..?50 శాతం ఇన్సెంటివ్స్‌.. 50% భూమిలో గృహ నిర్మాణాల‌కు అనుమ‌తేంటీ..? ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు గుడివాడ అమ‌ర్ నాథ్. ఈ భూ పందెరాన్ని ఆపేందుకు పోరాటం చేస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ కూట‌మి స‌ర్కార్ కు. రాష్ట్రంలో పాల‌న సాగ‌డం లేద‌ని చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *