పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక

మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌క‌ట‌న‌

అమ‌రావ‌తి : రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పూర్తి పార‌ద‌ర్శకంగా కానిస్టేబుళ్ల రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం జరిగింద‌ని అన్నారు. ఈ ప‌రీక్ష ద్వారా 5,500 మంది కొత్త‌గా కానిస్టేబుళ్లుగా కొలువు తీర‌నున్నార‌ని పేర్కొన్నారు. నేరం జరగ‌క ముందే ప్రీవెంటింవ్ విధానం అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. న్యాయ వ్యవస్థను పటిష్ట పరిచేలా ఇన్వెస్టిగేషన్ లోనూ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామ‌ని చెప్పారు. సీసీటీవీ, డ్రోన్స్, ఫింగర్ ప్రింట్స్ సహా ఫోరెన్సిక్ టెక్నాలజీని ఆధునీకరించి వినియోగిస్తున్నాం అన్నారు.

కాగా తాజాగా ఎంపికైన కానిస్టేబుళ్లలో శ్రీకాకుళం, విజయనగరం వారే ఎక్కువ మంది ఉన్నారని వెల్ల‌డించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లను, ఆర్మడ్ రిజర్వు సహ పోలీసులుగానూ మహిళల్ని చంద్రబాబు ప్రోత్సహించారని చెప్పారు. శక్తి టీమ్స్, శక్తి వాహనాలు, యాప్ లు ఏర్పాటు చేసి మహిళల రక్షణను పటిష్ట పరిచామ‌ని అన్నారు. ఖాకీ చొక్కా ప్రజలకు ఓ భరోసా కావాలి. ప్రజలందరికీ భద్రతను కల్పించటమే లక్ష్యంగా పని చేయాల‌ని పిలుపునిచ్చారు. పగలు, రాత్రి, పండగ పబ్బం లేకుండా పని చేయాల్సిన విధుల్లో పని చేయబోతున్న వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *