బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
కృష్ణా జిల్లా : ఈ దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నారా లోకేస్ వాజ్ పాయ్ విగ్రహావిష్కరణకు రావడం సంతోషంగా ఉందన్నారు. మహావీర్ త్యాగి కూడా ఆరోజు నెహ్రూ పై తీవ్రంగా మండిపడ్డారని అన్నారు. 1961 లోనే మన దేశ సైనిక శక్తిని పెంచుకోవాలని వాజ్ పాయ్ చెబితే.. నెహ్రూ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అణుబాంబు శక్తి కావాలని మొదటిసారి మాట్లాడిన వ్యక్తి వాజ్ పాయ్ అని గుర్తు చేశారు. వూ వాంట్ అణుబాంబ్ అని పెద్ద ఎత్తున వాజ్ పాయ్ ఉద్యమం చేశారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు వాజ్ పాయ్ ని అవమానించేలా మాట్లాడారని కానీ ఏనాడూ తగ్గలేదన్నారు.
శక్తి శాలిగా దేశం ఉండక పోతే.. మనపై దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించిన గొప్ప నేత వాజ్ పాయ్ అని కొనియాడారు మాధవ్. ఆయన ప్రధాని అయిన తర్వాత అగ్రదేశాల హెచ్చరికలను కాదని, ఐదు అణు విస్పోటాలను చేసి అణుశక్తిగా దేశాన్ని నిలిపారన్నారు. ఇది కేవలం మా దేశానికి రక్షణే తప్ప.. ఇతర దేశాలపై దాడి చేయడానికి కాదని సంతకాలు చేశారన్నారు. కమ్యూనిస్టులతో సహా అందరినీ కలుపుకు వెళ్లిన నేత వాజ్ పాయ్ అని ప్రశంసలు కురిపించారు. ఎమర్జెన్సీ సమయంలో వాజ్ పాయ్ పెద్ద ఎత్తున పోరాటం చేసి జైలుకు వెళ్లారు. ఆయన కృషి కారణంగా 19 నెలల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేశారని అన్నారు. 1980 లో బీజేపీని స్థాపించి అధ్యక్షుడిగా పర్యటించారని అన్నారు.





